ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో విద్యార్థులు పాము కాటుకు గురైన విషయం తెలిసిందే. పాము ఘటన గురించి ముఖ్యమంత్రి జగన్ కు మంత్రులు పుష్ప శ్రీవాణి మరియు .సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు. ఈ ఘటనలో ఒక విద్యార్ధి చనిపోయారు. మరో రెండు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. విద్యార్ధి మృతి పైన స్పందించిన జగన్ 5 లక్ష లు సాయం ప్రకటించారు. మంత్రుల ద్వారా ఈరోజు విద్యార్ధి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలియచేసారు. విద్యార్ధి మృతి పైన జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
పాఠశాలలో అసలు ఎం జరిగింది అంటే విజయనగరం జిల్లా కురపాంలోని పంచాయతీ పరిధిలో బీసీ గురుకుల విద్యాలయంలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటు వేసిన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటు వెయ్యగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. నిన్న రాత్రి 1 గంటకు పాము కాటువేయడం వెయ్యడం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు . ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మరణించినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మృతిచెందిన విద్యార్థిని మంతిని రంజిత్గా గుర్తించారు.