జగన్ ప్రభుత్వం దేశం లో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో ప్రజల కోసం వాలంటీర్ వ్యవస్థ స్థాపించారు. దీని దేశ వ్యాప్తంగా మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ ఇక్కడ వాలంటీర్లు మాత్రం పక్క దావా పడుతున్నారు. ఇటీవల వాలంటీర్లు ప్రభుత్వ పథకాల సాకుతో ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. మొన్నే ఒక వాలంటీర్ అవ్వ తాతలకు వచ్చే పింఛను తీసుకొని పరారయ్యాడు. తాజాగా వాలంటీర్ ఇంట్లో ఉన్న యువతీ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో ఈ
దారుణం చోటుచేసుకుంది. బొబ్బిల్లంక గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న బూసి సతీష్ 23 ఏళ్ల యువకుడు అదేగ్రామానికి గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది. ప్రభుత్వ పధకాలు సాకుతో బాలిక ఇంటికి తరచు వెళ్ళేవాడు.. బాలిక పైన కన్నేసిన సంతోష్ ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో..ఒంటరిగా ఉన్న యువతీ పై అత్యాచారనికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ పరువే పోతుంది ఆలా చెప్తే చంపేస్తానంటూ సతీష్ యువతిని బెదిరించాడు. అయితే యువతీ ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు అడగా అసలు విషయం చెప్పేసింది. వాలంటీర్ అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదుచెయ్యగా …రంగంలోకి దిగిన పోలీసులు వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేసారు.