గుంటూరు : బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దోషి శశికృష్ణకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. చాల రోజులుగా సాగుతున్న ఈ కేసుకు తెర పడింది. న్యాయమూర్తి రాంగోపాల్ తుది తీర్పు వెలువరించారు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన రమ్య తన కాంటాక్ట్ ని బ్లాక్ చేసిందని అని కక్షపెంచుకున్నాడు . దీంతో గత ఏడాది గుంటూరు లో ఆగస్టు 15 న పరమయ్యకుంటలో అందరూ చూస్తుండగానే అతి కిరాతంకాగా కత్తి తో పొడిచి చంపేశాడు. వెంటనే ఘటన ఘటనా స్థలనికి చేరుకొని శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగష్టు నుంచి 8 నెలల పాటు కేసు విచారణ కొనసాగింది. మొత్తం ఈ కేసు లో 28 మంది సాక్షులను న్యాయస్దానం విచారించింది.
శశీకృష్ణ కృష్ణ కు ఉరి శిక్ష పడడం ద్వారా తమ కూతురు కు న్యాయం జరిగింది అని ప్రభుత్వానికి, పోలీసులకు రమ్య తండ్రి నల్లా వెంకట్రావ్ కృతజ్ఞతలు తెలియచేసారు. ఎలాంటి ఉన్మాదులకు ఉరే సరియైన శిక్ష అన్నారు. మరో వైపు సాయిక్రిష్ణ తల్లి తమకు ఎవరు లేరని ప్రభుత్వం తమని ఆదుకోవాలన్నారు.