ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజా గా ఇచ్చిన 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ అందరూ జిల్లాల ప్రక్రియను స్వాగతిచినప్పటికీ జిల్లాల పేర్లు వాటి కేంద్రాల విషయం లో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేయాలన్న డిమాండ్‌తో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మౌనదీక్ష చేసారు. అన్ని అర్హతలు వున్నా హిందూపూర్ ని జిల్లా గా ప్రకటించాలి… ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధం అన్నారు బాలయ్య. రేపు అనంతపురం వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు.
బాలయ్య హిందూపురం రావడంతో ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు.. అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అబెండకార్ విగ్రహం వరుకు భారీ ర్యాలీ చేపట్టారు.బాలయ్య దీక్ష తో ప్రభుత్వం దిగి వస్తుందని అభిమానులు చెప్తున్నారు.