ఇటీవల బండి సంజయ్ పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారు అని బండి సంజయ్ మరియు బీజేపీ నాయకుల ఫిర్యాదుల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు డీజీపీ, కరీంనగర్ సీపీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్కు, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీకి కూడా లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది.
అయితే దీని పైన ఇంకా ప్రభుత్వం తరపున ఎవరు స్పందిచలేదు.