16716902607537667714


బిగ్ ట్విస్ట్: ముందస్తుకు జగన్..2023లో ముహూర్తం?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చనే ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే..అధికార టీఆర్ఎస్ ఆ ప్రచారం కరెక్ట్ కాదన్న సరే విపక్షాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని అంటున్నాయి. అయితే ఈ ముందస్తు ఎన్నికల గోల ఏపీలో కూడా ఉంది. జగన్ ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. జగన్ ముందస్తుకు వెళ్తారని, ఎన్నికలకు సన్నద్ధంగా ఉందని టీడీపీ శ్రేణులకు సూచిస్తూ వస్తున్నారు.

అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని, పూర్తి గడువు వరకు కొనసాగుతామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ అంటుంది. దీంతో ఎవరి మాట నమ్మాలో..ఎవరిది నమ్మకూడదో అర్ధం కాకుండా ఉంది. కాకపోతే ముందస్తుకు వెళ్లాలన్న..ఆగాలన్న జగన్ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ప్రకారం చూసుకుంటే జగన్ ముందస్తుకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రతిపక్షాలు పూర్తిగా బలపడకముందే ముందస్తుకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నారని తెలిసింది.  ఆ మేరకు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. అయితే ముందస్తుకు సంబంధించి తాజాగా..వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చిన ఓ మెసేజ్ హింట్ వచ్చింది. బూత్ ఇంచార్జ్‌ల సమాచారం కావాలని చెప్పి వైసీపీ అధిష్టానం..ఎమ్మెల్యేలకు మెసేజ్ పంపిందట.

ఇప్పుడే ఎన్నికలు లేవు..మరి అలాంటప్పుడు అప్పుడే బూత్ లెవెల్ నేతల డీటైల్స్ ఎందుకని కొందరు ఎమ్మెల్యేలు..పైనున్న నేతలని అడుగుతున్నట్లు సమాచారం. ఇదంతా ముందస్తు కోసం జరుగుతున్న ప్రక్రియ పై నేతల నుంచి వస్తున్న సమాధానం అని తెలుస్తోంది. వచ్చే బడ్జెట్ సమావేశాలు అంటే మార్చిలో సమావేశాలు తర్వాత..క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని, ఆ తర్వాత ప్రభుతావ్న్ని రద్దు చేసుకుని జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందట. అంటే 2023 మార్చి టూ జూలై లోపు ప్రభుత్వాన్ని రద్దు చేసి..2023 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి జగన్ ఆలోచన ఎలా ఉందో చూడాలి

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow