అఫ్గానిస్థాన్‌లో లో మరో సారి ఉగ్రవాదులు రేచిపోయ్యారు. ఉత్తర అఫ్గానిస్థాన్ లోనిన్న రాత్రి మినీ బస్సుల్లో బాంబులు పెట్టి పేల్చేశారు. ఈ రెండు బాంబులు పేలడంతో 9 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని అయిన మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులకు బాంబులు అమర్చి పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు చెప్తున్నారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ఉగ్రవాదులు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ స్వయంగా ఐఎస్‌ఐఎస్ చెప్పుకొచ్చింది. దీంతో తగిన మూల్యం త్వరలోనే ఉగ్రవాదులకు చెలిస్తాం అని తాలిబన్ ను హెచ్చరించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs