బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో ప్రధాన మోదీ ద్వైపాక్షిక చర్చ లు ఢిల్లీ లో జరుపుతున్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కు చేరుకున్నారు. ఈ సమావేశంలో భారత్, బ్రిటన్ దేశాల ద్వైపాక్షిక అంశాలతోపాటు బ్రిటన్లో ఖలిస్థాన్ మద్దతుదారుల వ్యవహారం చర్చకు రానుంది. దీంతో పాటు ఇరు దేశాలకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంపైనా చర్చలు జరగనున్నాయి. దీంతో పాటు ఉగ్రవాదానికి అంశాల పైన అలాగే భారత్లో పెట్టుబడులు మరియు బ్రిటన్ దేశంలోని భారతీయులకు వీసాల గురించి వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో లో చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్, భారత్ దేశాల విదేశాంగ మంత్రులు, దేశ మంత్రులు మరియు ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs