ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీ పథకాన్ని వాయిదా వేసింది. రేషన్‌కార్డుదారులకు బియ్యానికి బదులుగా నగదు ఇవ్వడానికి నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. తాజా గా రేషన్ కార్డు యాప్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీని నిలిపివేసినట్టు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. నగదు బదిలీపైన ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతుల గురించి మాట్లాడుతూ రైతుల పొలాల దగ్గరకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లా ని యూనిట్‌గా తీసుకుని రైతులకు దగ్గరగా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs