16716902607537667714

టీవీ చానళ్లపై కేంద్రం పెత్తనం!

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: టీవీ చానళ్లను ఆధీనంలోకి తీసుకొనేలా కేంద్రంలోని మోదీ సర్కారు వ్యవహరిస్తున్నది. ఏది ప్రసారం చేయాలో, ఏది ప్రసారం చేయకూడదో నిర్ణయిస్తున్నది. దేశంలోని టీవీ చానళ్లన్నీ ప్రతి రోజు 30 నిమిషాల పాటు జాతీయ ప్రాముఖ్య వార్తలను ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ అప్‌లింకింగ్‌, డౌన్‌లింకింగ్‌ మార్గదర్శకాలను వెలువరించింది.

ఆ 30 నిమిషాల పాటు విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మహిళల సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమం వంటి అంశాలపై కథనాలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. సమాజంలోని విభాగాలు, పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత అంశాలకు కూడా చోటు కల్పించాలని స్పష్టం చేసింది. అయితే, ఆ సమాచారాన్ని ప్రభుత్వం అందించబోదని, టీవీ చానళ్లే సేకరించుకోవాలని వివరించింది.

ఈ నిబంధన స్పోర్ట్స్‌, వైల్డ్‌ లైఫ్‌, విదేశీ చానళ్లకు వర్తించదని తెలిపింది. అటు.. టీవీ చానళ్లకు అప్‌లింకింగ్‌, డౌన్‌లింకింగ్‌లో ఉన్న కొన్ని నిబంధనలను సడలించింది. విదేశీ చానళ్లతో భారతీయ టెలిపోర్టుల అప్‌లింక్‌కు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు దీనిపై నిషేధం ఉండేది. అదేవిధంగా, న్యూస్‌ సంబంధం లేని ఈవెంట్ల లైవ్‌ టెలికాస్ట్‌కు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. మార్గదర్శకాలను తొలుత 2005లో జారీ చేశారు. అనంతరం 2011లో సవరించారు. దాదాపు 11 ఏండ్ల తర్వాత ఇప్పుడు.. పలు నిబంధనలను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. కాగా, చానళ్లలో తాము చెప్పిన అంశాలే ప్రసారం చేయాలని కేంద్రం ఆదేశించటంపై మీడియా వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇది మీడియా స్వేచ్ఛను హరించటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొత్త గైడ్‌లైన్స్‌ ఇవే..

  • టీవీ చానళ్లు కచ్చితంగా 30 నిమిషాల పాటు జాతీయ ప్రాముఖ్య వార్తలు ప్రసారం చేయాలి.
  • ఈవెంట్ల లైవ్‌ టెలికాస్ట్‌కు అనుమతి అవసరం లేదు.
  • విదేశీ చానళ్లతో భారతీయ టెలిపోర్టులు అప్‌లింక్‌ చేసుకోవచ్చు.
  • లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ సంస్థలు/ కంపెనీలు భారతీయ టెలిపోర్టుల నుంచి విదేశీ చానళ్లకు అప్‌లింక్‌ చేసుకోవచ్చు.
  • ఒక చానల్‌ ఒకటి కంటే ఎక్కువ టెలిపోర్ట్‌ శాటిలైట్‌ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.

ఒక కంపెనీ డిజిటల్‌ శాటిలైట్‌ న్యూస్‌ సేకరణ కాకుండా, ఆప్టిక్‌ ఫైబర్‌, బ్యాక్‌ ప్యాక్‌, మొబైల్‌ వంటి వార్తల సేకరణ పరికరాలను ఉపయోగించుకోవచ్చు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow