కరోనా చైనా లో మరో సారి విజృంభిస్తుంది. దేశం అంత కాస్త అదుపులోకి వచ్చిన షాంఘై నగరం లో మాత్రం కేసు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. నగరంలో లాక్ డౌన్ కఠినంగా వ్యవహరిస్తున్న అక్కడ కేసులు తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. గురువారం ఒక్క రోజే లోనే షాంఘై నగరంలో కరోనాతో 11 మంది మరణించారు. ఒక రోజులో ఈ నగరం నుంచి ఇంత మంది మృతి చెందడం తొలిసారి. ఎన్నో వారాల నుంచి షాంఘై నగరం లాక్ డౌన లో ఉంచిన భారీగా కేసు లు మరణాలు నమోదు అవుతున్నాయి.
కరోనా కేసుల సంఖ్యకాస్త తగ్గిందని కొంత ఆంక్షలను సడలిద్దామనుకుంటున్న నేపథ్యంలో కేసులు, మరణాలు మళ్ళి పెరగడంతో అధికారులు అవస్థలు పడుతున్నారు.
నిన్న ఒక రోజులో 17,629 కేసు లు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కట్టడికి వివిధ నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రజలు అసలు ఇంటి నుంచి బయటకు రాకూడదు అని కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వ్యాయామాలు చేయకుండా, నడవడం వంటి దృశ్యాల నేపథ్యంలో ఇకమీదట అసలు బయటకు రాకుండా చూడాలని నిబంధనలు అమలు చేస్తున్నారు.చైనా తో పాటు అమెరికా లో కూడా భారీగా కేసు లు నమోదు అయ్యాయి నిన్న ఒక రోజులో 73 వేల కేసులు నమోదు అయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా 4 వ వేవ్ మొదలైనటే అంటున్నారు నిపుణులు.