రెండు ఏళ్ళు గడుస్తున్నా కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తుంది. ఇప్పటికి రోజు ప్రపంచ వ్యాప్తంగా వందల మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి అన్ని దేశాల మరణ గణాంకాలను విడుదల చేసింది డబ్యూహెచ్ ఓ.. గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది కరోనా బారిన పడి మరణించినట్లు పేర్కొంది. ఇందులో భరత్ లో 15 లక్షల మంది చనిపోయినట్లు పేర్కొంది.
అయితే WHO గణాంకాలు తప్పు అని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. తమ దేశంలో అంత మంది మరణించలేదు అంటూ చెప్పుకొస్తున్నాయి. ఇదే బాటలో భారత్ కూడా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను లెక్కించడానికి WHO ఉపయోగించిన పద్దతి తప్పు అని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఈ నమూనా ద్వారా చేసిన గణన పూర్తిగా వేరే ఉంటాయని పేర్కొంది. WHO చే గణిత నమూనాలను పైన భరత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. డేటా సేకరణ పద్ధతి సందేహాస్పదమని భరత్ చెప్తుంది. నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన పటిష్టమైన నిఘా వ్యవస్థ ఆధారంగా చేసుకుంటే దేశంలో అధికారిక డేటా ప్రకారం, 2020 ఏడాది లో మరణించిన వారి సంఖ్య 1.49 లక్షలు మాత్రమే అని చెప్పారు. ఆగ్నేయాసియా, యూరప్ మరియు అమెరికాలలో అత్యధిక మరణాలు 84 శాతం వరుకు సంభవించాయని WHO పేర్కొంది .