పలు దేశలో కరోనా మరోసారి విజృంభిస్తుంది. తాజా గా అమెరికాలో ఒక రోజులో 73770 కేసు లు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా 799 మంది మృతి చెందారు. ఒక అమెరికా నే కాకుండా చైనా లో కరోనా అల్లకల్లోకం సృష్టిస్తుంది. మన దేశంలోనే మరో సారో కరోనా రెక్కలు విరుస్తుంది రోజువారీ కేసులు 2వేలకుపైగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లో కరోనా నిబంధనలు మొదలయ్యాయి మాస్క్ లేకుంటే రూ. 500 జరిమానా విధిస్తున్నారు. దీంతో పాటు తమిళ్ నాడులో కూడా మరో సారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ కూడా కరోనా నిబంధనలు మొదలైయ్యాయి. ఇక పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో ఫోర్త్ వేవ్ అతి త్వరలో కాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాస్క్ లు ధరించి కరోనా నిబంధనలు పాటించాలి అని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. జులై లో 4వ వేవ్ అంచనా వేశారు నిపుణులు కానీ పరిస్థితిని చూస్తుంటే మే లోనే 4 వ వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs