గుంటూరు దగ్గర ఉన్న పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యా జరిగిన వ్యక్తిని కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా పోలీస్ లు గుర్తించారు. భర్త అపహరణపై నిన్న గురువారం పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేసింది . దీంతో రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని ఏళ్ల క్రితం చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందనే వార్త ఉన్న ఈ నేపథ్యంలోనే రామాంజనేయులు కిడ్నాప్, హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద హత్యకు గురైన రామాంజనేయులు డెడ్ బాడీ పోలీసులకు చిక్కింది.
రామాంజనేయులును అతి ఘోరంగా చంపేశారు. తీవ్రంగా రాళ్లతో కొట్టి కాల్వలో వేసి కాళ్ళతో తొక్కి నరికి మరి చంపేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు రామాంజనేయులు అనే అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన మృతుని భార్య, కుటుంబ సభ్యులు రామాంజనేయుల మృతదేహాన్ని గుర్తించారు.హంతకుల కోసం పోలీస్ లు గాలిస్తున్నారు.