ఇటీవల ఆన్లైన్ లో సైబర్ నేరాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీస్ లు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూట్ లో దోచుకుంటున్నారు. తెలంగాణ లో జిల్లా కలెక్టర్ మోసం బయట పడింది. జిల్లా కలెక్టర్ పేరుతో జిల్లా స్థాయి అధికారులకు చుక్కలు చూపించారు కేటుగాళ్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రొఫైల్ ఫొటో తో ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి మోసానికి పాల్పడ్డారు. మొదటిగా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ దగ్గర నుంచి రూ.50 వేలు అమెజాన్ లో ఈ- పే కార్డులను కొనుగోలు చేసారు కేటుగాళ్లు. అకౌంట్ లో 50 వేలు మాయం అయినా తర్వాత తేరుకున్నాడు అధికారి. ఇదే తరహాలో మరో కొందరి అధికారులు మోస పోయారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా మోస పోవడంతో వెలుగులోకి వచ్చింది. కొందరి అధికారులు పరువు పోతుంది అని బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు..ఇదంతా సైబర్ నేరగాళ్ల పనే అని ఆరా తీస్తున్నారు. లొకేషన్ ని ట్రాక్ చెయ్యగా బీహార్ నుంచి ఈ మోసం జరిగినట్టు పోలీస్ లు గుర్తించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs