దక్షిణ అండమాన్ సమీపం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసాని’ తుఫాన్ ఏర్పడిన విషయం తెలిసిందే . ఈ తుపాన్ ఈ నెల 10న తీరం దాటనుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను ప తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందంటూ పేర్కొంది. దీంతో తమిళ్ నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు సోమవారం రాష్ట్రంలోను, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో అనేక చోట్ల మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షం పడొచ్చని పేర్కొంది.
దీంతో పాటు తిరుచ్చి, కరూర్, పెరంబలూరు, కళ్ళకురిచ్చి, ఈరోడ్, సేలం,పుదుక్కోట, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై, కడలూరు, అరియలూరు, దర్మపురి, కృష్ణగిరి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడొచ్చని హెచ్చరించింది. వచ్చే రెండు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది . చెన్నై మహా నగరంలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉండనుంది.