Daily panchangamFraud AlertLive TvNalgondaVideoVotingఅంతర్జతీయంఅనంతపురంఅమరావతిఅల్లూరి సీతారామ రాజుఆదిలాబాద్ఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్‌ఈవెంట్స్ఎడిటోరియల్ - Editorialఎడ్యుకేషన్కరీంనగర్కర్నూలుకామారెడ్డికృష్ణాకెరియర్కొమరంభీం జిల్లాకొమురంభీం జిల్లాక్రీడలుక్రైమ్ఖమ్మంగుంటూరుగెస్ట్ కాలమ్స్చిత్తూరుజగిత్యాలజగిత్యాల జిల్లాజనగామజయశంకర్ భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లాజాతీయంజోగులాంబ గద్వాల జిల్లాతాజా వార్తలుతూర్పు గోదావరితెలంగాణనల్గొండనిజామాబాద్నెల్లూరునేషనల్ వార్తలుపశ్చిమ గోదావరిపెద్దపల్లిప్రకాశంప్రపంచంఫొటోలుబిజినెస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లామంచిర్యాలమరిన్నీమల్కాజిగిరిమహబూబాబాద్మెదక్సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్పెషల్స్పోర్ట్స్హెల్త్‌

 మాస్క్‌ లేకపోతే రూ.500 జరిమానా..

by Publicnowtelugu

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం వైరస్‌ను కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఆంక్షలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే, ప్రైవేట్ వాహనాల్లో కలిసి ప్రయాణించే వ్యక్తులపై జరిమానా నిబంధన వర్తించదని పేర్కొంది. నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) సమావేశం జరిగిన విషయం తెలిసిందే. రోజు రోజుకు వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో సమావేశంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకపోతే రూ.500 జరిమానా నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 2న ఎత్తివేసింది. ఆ సమయంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరోసారి ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. పాఠశాలల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
ప్రత్యేకంగా ఏడు పాయింట్లతో ఎస్‌ఓపీలను జారీ చేసింది.

Leave a Comment