శ్రీలంక లో మళ్ళి ఎమర్జెన్సీ ని ప్రకటించారు. ఈ అత్యవసర ఎమర్జెన్సీ నిన్న శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. గత 3 నెలల నుంచి శ్రీలంక లో ప్రజలు గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ రేట్స్ లీటర్ 500 రూపాయలు అయిన పరిస్థితి దీంతో ప్రజలు ప్రతి రోజు ధర్నాలు ప్రభుత్వ కార్యాలయాలపైనా దాడి చేస్తూ వచ్చారు. విదేశీ రుణాలతో శ్రీలంక దేశాన్ని కుంగ దీసిన ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ప్రజల భద్రతతో పాటు ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల సరుకులు పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఈ ఎమర్జెన్సీ విధిస్తున్నటు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కార్యాలయం నిన్న అర్ధరాత్రి ఈ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కార్మిక సంఘాలు సమ్మెతో విద్యార్థి సంఘాల పిలుపు తో కొలంబోలో వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లు మూతపడింది దేశంలో జన జీవనం స్తంభించి పోయింది. రాజపక్స రాజీనామా చెయ్యాలి అని నిరసనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ ఎమర్జెనీ విధించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs