జాతీయ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ ఇవాళ మరణించారు. ఈ నెల 4వ తేదీన పండిట్ సుఖ్ రామ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడగవతో హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఈయన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే 7 వ తేదీన ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో న్యూఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కు తరలించారు. అయితే.. పండిట్ సుఖ్ రామ్ నిన్న .. మంగళవారం అర్ధరాత్రి చిక్సిత్స పొందుతూ దాటిన తర్వాత మరణించారు. ఈయన చనిపోయినట్లు పండిట్ సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా… వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు సమాచారం.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs