అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు ఒక వైపు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ టెన్షన్ నెలకొంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది… అనంతపురం తెలుగుదేశం పార్టీ అర్బన్ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో పాటు పలువురు ఆశావాహులు టిక్కెట్ ఆశిస్తున్నారు.
రాజకీయ పార్టీల పొత్తులు ఎత్తుల ఖరారు ఇంకా అసంతృప్తిగానే కొనసాగుతున్నాయి. టిడిపి జనసేన పొత్తు ఇప్పటికే ఖరార్ అయింది. బిజెపితో కూడా పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది చర్చలు కొనసాగుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం అర్బన్ టికెట్ పై అసలు పెట్టుకున్న టిడిపి లో నేతలకు టెన్షన్ పట్టుకుంది. సమాజ్కవర్గాల సమీకరణలో భాగంగా టికెట్ ఏ వర్గాలకు పోతుంది అన్నది కూడా చర్చ సాగుతోంది. దాదాపుగా 67 వేల మంది ముస్లిం మైనార్టీలు ఓటర్లు ఉండడంతో ఈసారి టికెట్ తమకే కేటాయించాలని ఆ వర్గాల నుంచి కూడా టిడిపి అధిష్టానం పై ఒత్తిడి పెరుగుతుంది. మరో జనసేన పార్టీ నాయకులు కూడా అనంతపురం టికెట్ పై పూర్తిగా కనేశారు. పొత్తుల నేపథ్యంలో టికెట్లను సర్దే క్రమంలో అనంతపురం జనసేనకి పోతే తమ పరిస్థితి ఏమిటన్నది తెలుగుదేశం నేతల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి టికెట్ తనది అంటూ ధీమా వ్యక్తం చేస్తూ అనంతపురం నగరంలో ఇంటింటా తిరుగుతున్నారు, దీంతో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు టికెట్ ఎవరికీ ఖరారు కాలేదని, నాదే టికెట్ అంటూ ప్రభాకర్ చౌదరి చెప్పుకోవడంపై ప్రభాకర్ చౌదరి పై అసమ్మతి గళం వినిపించే నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. మన వైపు ముస్లిం మైనార్టీల నుంచి మాజీ ఎంపీ సైఫుల్ల తనయుడు జక్కీ వల్ల కూడా టికెట్ మాకే వస్తుందని చెబుతున్నాడు. కార్యక్రమాల పేరుతో జనం మధ్యన తిరుగుతున్నాడు, దుప్పట్ల పంపిణీ, మహిళలకు కుక్కర్లో పంపిణ ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు అంటూ ఆయన జనం మధ్య వెళ్లి తెలుగుదేశం పార్టీకి సహాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు మాజీ గ్రంథాల చైర్మన్ గౌస్ మోదిన్ కూడా టికెట్ అడుగుతున్నారు పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. అంతేకాకుండా పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సుబ్రహ్మణ్యం తనయుడు లలిత్ కృష్ణ అనంతపురం టికెట్ పై కన్నేశాడు. ఓ ఎన్నారై మహిళ అనంతపురం టికెట్ అడుగుతోంది. అంతేకాకుండా ఓ పారిశ్రామికవేత్త కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కలిసి అనంతపురం టికెట్ ఇవ్వాలని విన్నవించాడు. ఇలా అనంతపురం అర్బన్ టికెట్ కోసం ఆశిస్తున్నా వారి చట్టా చూస్తే బారెడంతగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా లేదా కొత్త వారి అభ్యర్థనను పరిశీలిస్తుందా అన్నది ఉత్కంఠంగా మారింది. అంతేకాకుండా అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన జేసీ సోదరులు రెండు టికెట్లను కోరుతున్నారు. తాడిపత్రి టికెట్ తో పాటు అనంతపురం ఎమ్మెల్యే టికెట్ కానీ లేదా అనంతపురం పార్లమెంట్ టికెట్ కానీ ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద వారు కోరినట్టు తెలుస్తుంది. అనంతపురం పార్లమెంట్ ఇన్చార్జి అయిన జెసి పవన్ రెడ్డి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నియోజకవర్గంలో ఇన్చార్జిగా అందరిని కలుపుకుపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అసమ్మతివాదులు తెలుగుదేశం పార్టీ అధినేత వద్ద ప్రభాకర్ చౌదరిపై ఫిర్యాదు కూడా చేసినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. నీ సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనవిగా ఆ వర్గాల్లో చెబుతున్నాయి. దీంతో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ధారణకు వచ్చినట్టు దేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇన్చార్జిగా ఉన్న ప్రభాకర్ చౌదరి టికెట్ ఇస్తారా? అధిక సమీకరణాల్లో భాగంగా అత్యధిక శాతం ఓట్లున్న ముస్లిం మైనారిటీల కేటాయిస్తారా? లేక పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి నేతలు త్యాగం చేయాల్సి వస్తుందా అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ టికెట్ ఎవరికీ కేటాయిస్తుందా అన్నది కూడా పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.