ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు రాచుకుంటుంది. రష్యా.. ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించే వరుకు తగ్గేదే లేదు అంటూ అణు బాంబు ను వేయడానికి కూడా సిద్ధం అవుతుంది. రష్యా అధ్యక్షుడు అణు బాంబు పేరు ఎత్తడంతో ప్రపంచ అగ్ర దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇదిలా ఉండగా రష్యా 2022 ప్రపంచ కప్ నుండి బహిష్కరించబడింది అంటూ ఫిఫా సోమవారం UEFAతో సంయుక్త కమిటీ సమావేశంలో వెల్లడించాయి.. ఇప్పటికే ప్రపంచ కప్ షెడ్యూల్ క్వాలిఫై మ్యాచ్ లు ఆడిన రష్యా కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. FIFA మరియు UEFA ఈ రోజు అన్ని రష్యన్ జట్లను, జాతీయ ప్రతినిధి జట్లు లేదా క్లబ్ జట్లు అయినా, తదుపరి నోటీసు వచ్చేవరకు FIFA మరియు UEFA పోటీలలో పాల్గొనకుండా నిలిపివేయాలని వెల్లడించాయి. అంతర్జాతీయ టోర్నీలో రష్యా ను అనుమతి ఇవ్వదు అంటూ ఐఓసీ పేర్కొంది. దీంతో ఒలంపిక్స్ లో కూడా రష్యా పాల్గొనడానికి లేదు.
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత గురువారం నుంచి యుద్ధం ప్రారంభం అయుంది , ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.