దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 26 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఢిల్లీ లోని వెస్ట్ ప్రాంతం ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్థుల బిల్డింగ్‌లో మంటలువ్యాపించాయి . కొన్ని నిమిషాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో బారి ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించగా మరో 30 మంది తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిన్న శుక్రవారం సాయంత్రం 5 గంటలసమయంలో ఈ అగ్ని ప్రమాదంచోటుచేసుకుంది. రాత్రి 11 వరకు అందులో ఉన్న జనాలు భవనంలోనే చిక్కుకున్నారు. మరోవైపు వెంటనే అగ్రిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుంది పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను అదుపు చేసేందుకు 25 అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగిన సమయంలో కొంతమంది భవనంపై నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నా.. వాళ్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. మెుదటి అంతస్థులో సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ కెమెరాల కార్యాలయంలో మంటలు వచ్చాయని దాని తర్వాత భవనం మొత్తం వ్యాపించినట్లు అధికారులు చెప్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు