ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో లొంగతీసుకొని స్నేహితులతో కలిసి అత్యాచారం చేసాడు. వివరాల్లోకి వెళ్తే గోరంట్లకు చెందిన విద్యార్థిని (22) తిరుపతిలోని కృష్ణతేజ ఫార్మసీ కాలేజీ లో ఫైనల్ ఇయర్ చదువుతూ హాస్టల్లోనే ఉంటోంది. అదే గోరంట్ల మండలనికి చెందిన సాదిక్‌తో ఈమె ప్రేమలో పడింది. ఈ క్రమంలో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడె పెళ్లి చేసుందాం అని చెప్పి రెండు రోజుల క్రితం విద్యార్థినిని కలిసి కారులో తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితుల వద్దకు తీసికెళ్ళి గదిలో బంధించి స్నేహితులతో కలిసి రెండు రోజుల పాటు అత్యాచారం చేసారు.
యువతిని హత్య చేసిన తరువాత సాదిక్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఏడుస్తూ డ్రామాలు ఆడాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే తమ కుమార్తెను నిందితులు హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నా పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తం చేయడం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ కోరుతూ గత అర్ధరాత్రి వరకు యువతి మృతదేహంతో బంధువులు గ్రామస్థులు గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి వరుకు బైఠాయించారు. విషయంతెలుసుకున్న పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప బాధితుల తరపున పోలీసులతో చర్చించారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేసారు. దీని పైన స్పందించిన డీఎస్పీ రమాకాంత్ రీపోస్టుమార్టం చేపిస్తామని , నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిందితుల పైన హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.