ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో భారీ నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6500 నుంచి 7000 వరకు పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నెలల కిందట పోలీస్ శాఖ ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే పోలీస్ శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది.
మొదటి దశ కింద ఈ ఏడాది 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఖరారు చేసింది. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ మరియు స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష ఆ తర్వాత ఫిజికల్ టెస్టులు నిర్వహించే ఫలితాలు వెల్లడించనుంది. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్ లో పోలీస్ శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి కొన్ని శాఖలో పోస్టింగులు ఇవ్వనున్నారు.