16716902607537667714

గ్రూప్-4 ఉద్యోగాలు.. ఏ శాఖలో ఎన్నంటే?

టీఎస్‌పీఎస్సీ గురువారం గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 25 శాఖల్లో 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో గ్రూప్‌-4 రాతపరీక్షను నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

శాఖలవారీగా పోస్టుల వివరాలు:
వ్యవసాయ, కో-ఆపరేషన్‌ శాఖ 44, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖ 02, బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ 307, ఫుడ్‌-సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్‌మెంట్‌ 72, విద్యుత్తు శాఖ 02, అటవీ, వాతావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ 23, ఆర్థిక శాఖ 255, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ 05, వైద్యారోగ్య శాఖ 338, ఉన్నత విద్యాశాఖ 742, హోంశాఖ 133, పరిశ్రమల శాఖ 07, నీటిపారుదల శాఖ 51, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ 128, మైనార్టీ సంక్షేమం 191, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ 2701, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ 1245, ప్రణాళిక శాఖ 02, రెవెన్యూ శాఖ 2077, ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖ 474, సెకండరీ ఎడ్యుకేషన్‌ 97, రవాణా, రోడ్లు, భవనాల శాఖ 20, గిరిజన సంక్షేమ శాఖ 221, స్త్రీ, శిశు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ 18, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ 13 పోస్టులున్నాయి.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow