తెలంగాణలో మున్సిపాలిటీలకు మరో 7 అవార్డులు దక్కాయ్. స్వచ్ఛ సర్వేక్షన్ లో మున్సిపాలిటీలకు మరో ఏడు అవార్డులు లభించాయి. ఫాస్ట్ సూపర్ సిటీ కేటగిరిలో మూడు నుంచి పది లక్షల జనాభా విభాగంలో వరంగల్ మూడవ స్థానంలో నిలిచింది. పదివేల నుంచి లక్ష జనాభా కేటగిరిలో కాగజ్నగర్ మరియు జనగామ మున్సిపాలిటీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 25 నుంచి 50 వేల జనాభా విభాగంలో అమనగల్, 15 నుంచి 25 వేల కేటగిరిలో గుండ్ల పోచంపల్లి, కొత్తపేట 2,3 స్థానంలో నిలిచాయి. 15 వేల లోపు జనాభా విభాగంలో వర్ధన్నపేటకు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు దక్కాయి.
అయితే తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు మరో ఏడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో అవార్డుల సంఖ్య 26 కు చేరిందని, దేశంలో ఎక్కువ అవార్డ్స్ వచ్చిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాగజ్ నగర్, జనగాం, అమన్గల్, గుండ్ల పోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు పురస్కారాలు వచ్చాయని వివరించారు.