సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం కొందరు మోసగాళ్లు సోషల్ మీడియాలో నకిలీ టిక్కెట్లను విక్రయిస్తున్నారు. నకిలీ టిక్కెట్ల విక్రయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు స్పందించారు. సోషల్ మీడియాలో నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్నారనే వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ అభిమానులకు సూచించారు. అభిమానులు తప్పుడు ప్రచారాలకు దిగవద్దని హెచ్చరించారు. ఎవరైనా సోషల్ మీడియాలో లేదా అనధికారికంగా టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే హెచ్సీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని జగన్ మోహన్ సూచించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs