ఈ ఇన్సులిన్ ఉపయోగించే ముందు మీరు తెలుసుకోవలసిన అంశాలు

by Publicnowtelugu

ఇన్సులిన్ ధరలు చుక్కలంటుతున్నందున చాలామంది ప్రజలు వాల్‌మార్ట్ రెలిఅన్, ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) ఇన్సులిన్‌ల వైపు వెళుతున్నారు. ఇవి ఇన్సులిన్ కంటే భిన్నంగా ఎలా ఉంటాయో, మీ డ్రగ్ ప్రొవైడర్‌తో ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకోవడానికి కొన్ని సూచనలు చూడండి.

ఓటీసీ ఇన్సులిన్ అనేది డాక్టర్లు సూచించే ఇన్సులిన్ కంటే చౌక ధరకే వస్తుంది. అయితే మీ వైద్యులను సంప్రదించిన తర్వాతే డోసేజ్ తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

మధుమేహ వ్యాధి ఉన్న చాలామందికి ఇన్సులిన్ ధర సీరియస్ సమస్యగా ఉంటోంది. మరి దీనికి చౌక ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఓవర్ ది కౌంటర్ లేదా ఓటీసి. ప్రిస్క్రిప్షన్ క్రమబద్ధీకరణలోని లోపాల వల్ల దశాబ్దాలుగా ఇది ప్రజలకు లభ్యమవుతున్నప్పటికీ, ఇటీవలే ఓటీసీ ఇన్సులిన్ మరింత చౌకధరకు లభ్యమవుతోంది. కారణం.. వాల్‌మార్ట్ తన సొంత బ్రాండ్ రెలియన్ ఇన్సులిన్‌ని మార్కెట్లో అమ్మడానికి మరో డ్రగ్ మేకర్ నోవో నోర్‌డిస్క్‌తో ఒప్పందం కుదుర్చుకోవడమే.

ఓటీసీ ఇన్సులిన్‌ని ఎంతమంది ఉపయోగిస్తున్నారో స్పష్టంగా తెలియనప్పటికీ, 2019 ఫిబ్రవరిలో జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ సూచించినట్లుగా  అమెరికాలోని 49 రాష్ట్రాల్లో రోజుకు 18,800 వెయిల్స్‌ని వాడుతున్నట్లు తెలిసింది.

ఓటీసీ ఇన్సులిన్ ఇంత తరచుగా అమ్ముడవుతుండటం మాకూ ఆశ్చర్యం కలిగించిందని న్యూయార్క్ లోని క్రిస్టియానా కేర్ హెల్త్ సిస్టమ్ లోని ఇంటర్నల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఎండీ జెన్నిఫర్ గోల్డ్ స్టీన్ చెప్పారు. వాల్మార్ట్ తన సేల్స్ డేటాను ప్రజలకూ బహిరంగపర్చదు. కాబట్టే పరిశోధకులు వాల్మార్ట్, ఇతర చెయిన్ ఫార్మసీలను నేరుగా సంప్రదించి ఈ డేటా తెలుసుకున్నారు.

ఓటీసీ ఇన్సులిన్ ఉపయోగం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ మధుమేహం కలిగిన వారు ఇవి ప్రిస్క్రిప్షన్ ఇన్సులిన్‌ లాంటివి కావని తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డబ్బులు ఆదా చేసుకోవాలని భావిస్తున్నవారు ఈ ఓటీసీ ఇన్సులిన్ తీసుకోవడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

 ఓటీసీ ఇన్సులిన్‌ వైపు ఎందుకెళతారంటే….. 
తన క్లినిక్‌కి ఆరోగ్య బీమా లేకుండా వచ్చే రోగులకు తక్కువ ఖర్చుతో కూడిన రెలిఅన్ బ్రాండ్ ఇన్సులిన్‌ను డాక్టర్ గోల్డ్ స్టీన్  సిఫారసుచేస్తారు. అందుకే ఆమె ఓటీసీ ఇన్సులిన్‌పై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. 2002 సంవత్సరం నుంచి 2013 నాటికే ఇన్సులిన్ ధరలు మూడురెట్లు పెరిగాయి. 2019లో ఎలి లిల్లీ కంపెనీ తక్కువ ఖర్చుతో కూడిన జెనెరిక్ వెర్షన్‌ హ్యుమలోగ్ 100 ఇన్సులిన్‌ని వెయిల్‌కి 137 డాలర్లకే అమ్ముతానని ప్రకటించింది. అంటే ఒరిజనల్ ఇన్సులిన్ ధరలో ఇది సగం మాత్రమే. ఇకపోతే సిగ్నా, ఎక్స్‌ప్రెస్ స్క్రిప్ట్స్ సంస్థలు ప్యాకెట్ కేప్‌ని 25 డాలర్లకే అమ్ముతామని ప్రకటించాయి.

యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోలో ఫార్మసూటికల్స్ సైన్సెస్ విభాగంలో అసోసియేట్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ ట్రుజిలో కూడా, చౌక ధరకు లభించే  ఇన్సులిన్ కోసం రోగులు తనను అడుగుతుంటారని చెప్పారు. కొంతమంది రోగులకు తక్కువధరకు లభ్యమయ్యేది తప్ప మరో ఆవకాశం ఉండదని, వీరికి చౌకధర ఇన్సులిన్ తప్ప మరో ప్రత్యా మ్నాయం లేదని చెప్పారు. ఆరోగ్య బీమా లేని వారు ఓటీసీ ఇన్సులిన్‌నే లెక్కలోకి తీసుకుంటారని తెలిపారు. ఇన్సులిన్ ధర గణనీయంగా పెరిగింది కాబట్టి చాలామంది రోగులు దాన్ని కొనేందుకు డబ్బులు వెచ్చించలేక పోతున్నారని, టైప్1 మధుమేహరోగులు 2012తో పోలిస్తే 2016లో ఇన్సులిన్‌కి డబుల్ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు.

ఓటీసీ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది.. …కొత్త ఇన్సులిన్‌లకు దీనికి తేడా ఏమిటి?  
ఓటీసీ ఇన్సులిన్‌ని సింథటిక్ హ్యూమన్ ఇన్సులిన్ అని కూడా అంటుంటారు. ఇది ఇన్సులిన్ అనలాగ్స్ అని పిలిచే కొత్త ఇన్సులిన్‌లకు భిన్నమైనది. ఓవర్ ది కౌంటర్ ఇన్సులిన్ ప్రధానంగా 3 రకాలు. 

1. రెగ్యులర్ ఇన్సులిన్ (తక్కువ కాలం పనిచేసేది), 

2. ఎన్‌పిహెచ్ (ఇంటర్మిడియట్ యాక్టింగ్), 

3. ఎన్‌పిహెచ్, రెగ్యులర్ ఇన్సులిన్‌ల సమ్మేళనం.

వాల్మార్ట్ కంపెనీ ఈ మూడు రకాల ఇన్సులిన్‌లను రెలిఅన్ బ్రాండ్ కింద్ వెయిల్‌కి 25 డాలర్ల చొప్పున అమ్ముతోంది. చెయిన్ ఫార్మసీలు కూడా రెగ్యులర్, ఎన్‌పీహెచ్,   70-30 ఇన్సులిన్ రకాలను కౌంటర్ వద్దే రోగులకు అమ్ముతున్నాయి. అయితే ఇతర చెయిన్ ఫార్మసీల కంటే వాల్మార్ట్ కంపెనీ తీసుకొచ్చిన ఓటీసీ ఇన్సులినే ఎక్కువగా అమ్ముడవుతోందని గోల్డ్ స్టీన్ చెప్పారు. దీనికి కారణం వాటికంటే వాల్మార్ట్ ఓటీసీ ధర తక్కువ.

కొత్త ఇన్సులిన్ల కంటే ఓటీసీ ఇన్సులిన్లు పూర్తి భిన్నంగా పనిచేస్తాయి. వాటిని తీసుకునే పద్ధతి, ఎంతకాలం పాటు పనిచేస్తాయి, అవి పీక్ స్టేజికి ఎప్పుడు వెళతాయి అనే అంశాలే రెండింటికీ మధ్య వ్యత్యాసాన్ని చూపుతాయి. ఉదాహరణకు రెగ్యులర్ ఇన్సులిన్లను తీసుకున్న 30 నుంచి 60 నిమిషాల తర్వాతే పనిచే్స్తాయి కాబట్టి వాటిని తీసుకోవడానికి గంట ముందే మీరు భోంచేయాల్సి ఉంటుంది. కొత్త ఇన్సులిన్లను భోజనం చేయడానికి ముందే తీసుకోవచ్చు. ఎన్‌పీహెచ్ ఇన్సులిన్ ఆరుగంటల తర్వాత పీక్‌కి వెళుతుంది. అదే కొత్త ఇన్సులిన్‌లకు అసలు పీక్ అనే కొలబద్దే ఉండదు అని గోల్ట్ స్టీన్ చెప్పారు. ఇవి చాలా వైవిధ్య పూరితంగా  పనిచేస్తాయి కాబట్టి పాత, కొత్త ఇన్సులిన్ల గురించి చక్కటి అవగాహన రోగులకు ఉండాలని ఆమె చెప్పారు.

Leave a Comment