భగ భగ వరానికి మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పటికీ ప్రస్తుతం నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బాలాపూర్, బర్కత్‌పురా, అబిడ్స్, సికింద్రాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. గోల్కొండ, టోలీచౌకా, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. షేక్‌పేట, మణికొండ, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఇన్ని రోజులు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త చల్లదనాన్నిచ్చింది.
హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం నిజామాబాద్‌లో వడగళ్ల వాన కురిసింది. సిద్దిపేటతోపాటు పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి మేఘాలు తొలగిపోయాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs