సీపీఎస్ రద్దుని కోరుతూ విజయవాడకు ఛలో సీఎంఓకు యూటీఎఫ్ పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసందే. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో దారులు పోలీసులు కాపు కాసారు. తాడేపల్లిలోని ముఖ్య మంత్రిక్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎటువంటి ఆటంకాలు జరుకాకుండా సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో రోడ్లు నింపేశారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద బస్సు లు లారీ లను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ గ ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి రానున్న సమాచారంతో రైలు, రోడ్డు మార్గాన ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ, గుంటూరులకు చేరుకోకుండా స్టేషన్లు, బస్స్టాండ్ల భారీగా మోహరించి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్పష్టం చేశారు. ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs