జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోర్టుల నిర్మాణానికి ఏపీ మారిటైం బోర్డు మరో దాదాపు 4 వేల కోట్ల రుణాలు తీసుకోబోతోంది ఏపీ సర్కార్. ఇప్పటికే కాకినాడ, రామాయపట్నం పోర్టుల కోసం రూ.3,579 కోట్ల రుణాలు తీసుకుంది. రాష్ట్రంలో ప్రతిపాదించిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు అవసరం.
ఇందులో ఇప్పటికే తీసుకున్నవి పోను మరో రూ.9,500 కోట్ల రుణాల కోసం వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం అందే అవకాశం లేకపోవడంతో, రుణాలు అందితేనే ప్రాజెక్టులు ముందుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీనికోసం భూములను తనఖాగా పెట్టడంతో పాటు, ప్రస్తుతం మారిటైం బోర్డుకు ఉన్న ఆదాయ వనరులు, పోర్టుల నిర్మాణం పూర్తయ్యాక వచ్చే ఆదాయాన్ని హామీగా చూపుతోంది.