అనంతపురం జిల్లా లో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ పైన మండిపడ్డారు. నేను విధానాలపై మాట్లాడుతున్నా జగన్ నన్ను= చంద్రబాబు దత్త పుత్రుడు అంటున్నారు. మీరు అసలైన సీబీఐ దత్త పుత్రులు. జైల్ జీవితం గడిపి వచ్చారు అన్నారు. నాకు నీతులు చెప్పే స్థాయి వైఎస్సార్సీపీ కి లేదు అన్నారు పవన్.
నేను టీడీపీలో ” B ” టీం అయితే మీరు చర్లపల్లి ” బి ” టీం పైగా 16 నెలలు ఉండి వచ్చారు. ఇంకొక్కసారి నన్ను CBN కి దత్తపుత్రుడు అని అంటే మాత్రం జగన్ రెడ్డిని CBIకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది.సీబీఐ దత్తత తీసుకుంది వైసీపీ అగ్రనాయకత్వాన్ని,16 నెలలు జైల్లో ఉండి షటిల్ ఆడుకుని వచ్చారు. అంతేకానీ స్వాతంత్ర్య పోరాటాలు చేసి జైలుకి వెళ్ళలేదు..మాకు నీతులు చెప్పే ముందు మీబ్రతుకులు చూసుకోండి అన్నారు. చనిపోయిన ప్రతి కౌలురైతు కుటంబానికి వైసీపీ ప్రభుత్వం 7లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే..చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి మా సహాయం మెం చేస్తాం..
ప్రతి జిల్లాకి తిరుగుతాం అన్నారు పవన్ కళ్యాణ్.