అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరూర్ టోల్ గేట్ దగ్గర భాకర్ రెడ్డి ని అరెస్ట్ చేసారు ఈయన పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే ఊరు వెళ్లే స్వేచ్ఛ కూడా నాకు లేదా అంటూ అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళతారో తీసుకెళ్లండంటూ జేసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జేసీ.
ఎవరు అడ్డుకున్నా సరే పుట్టపర్తికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న కూడా అరెస్ట్ చెయ్యడం ఏంటని జేసీ ప్రశ్నించారు.