చెన్నై : వేసవి లో నిమ్మకాయలు రికార్డు ధర పలుకుతుంది. గత కొన్ని రోజులుగా చెన్నై స్థానిక కోయంబేడు మార్కెట్లో కేజీ నిమ్మపండ్లు రూ.180 పలుకుతున్నాయి. కొన్ని రోజులుగా చెన్నై లో ఎండ తీవ్రత మరింత ఎక్కువ ఉండడంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు జ్యూస్ లు , నిమ్మపండ్ల రసం వంటి వాటిని ఎక్కువగా తాగుతున్నారు. నిమ్మ కాయలు వినియోగం భారీగా పెరగడంతో పాటు వాటి దిగుబడులు కూడా తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. కోయంబేడు మార్కెట్లో ఇంతకముందు లక్ష కిలోల నిమ్మపండ్లు దిగుమతి అవుతూండేవి కానీ ప్రస్తుతం 50 వేల కిలోలు మాత్రమే దిగుమతి అవుతుండంతో ఒక కిలో రూ.170-180 పలుకుతుండగా ఒక పండు రూ.8, చిల్లర దుకాణాల్లో ఒక పండు రూ.10కి విక్రయమవుతోంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs