వేసవి మొదలవ్వడంతో నిమ్మకాయలు రెక్కలు వచ్చాయి. ఈ వేసవి లో మరింత ఎండలు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో నిమ్మకాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. నిన్న నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్‌లో నిన్న నిమ్మకాయలకు రికార్డు ధర పలకడం విశేషం. ఓ రైతు తెచ్చిన మొదటిరకం నిమ్మకాయలను మార్కెట్‌లో వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
రెండో రకం కాయలు రూ. 130-150 మధ్య పలుకుతున్నాయి. మూడో రకం నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతుంది. గతేడాదితో పోలిస్తే వీటికి ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాలో కిలో యాపిల్ పండ్లను రూ. 150-200 మధ్య విక్రయిస్తుండడం నిమ్మ మొదటి సారి ఆపిల్ తో పోటీ పడి ధర పలకడం చర్చనీయాంశంగా మారింది.