భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె షాజపూర్‌లోని మంత్రి పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు. రాత్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నిన్న మంగళవారం జరగ్గా మృతురాలిని సవితా పర్మార్ (23)గా గుర్తించారు. 2019 లో సవితా పర్మార్‌కు మంత్రి కుమారుడు దేవ్‌రాజ్ పర్మార్‌తో పెళ్లి జరిగింది. మంత్రి కోడలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అని కేసు నమోదు చేసిన పోలీసులు సవితా బలవన్మరణానికి కారణాలేంటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు మంత్రి భోపాల్ లో ఉన్నారు. సవిత భర్త దేవరాజ్ సింగ్ పక్క ఓ మహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హజరైనట్లు సమాచారం. మంత్రి కోడలి విషాదాంతం లో పార్టీ లో సంచలంగా మారింది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs