మద్యంకు బానిస ఆయన వ్యక్తి ఒక మనిషి ప్రాణాలు బలితీసుకుంది. మధ్య మత్తులో అనేక అత్యాచారాలు మరియు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక వ్యక్తి మద్యం మత్తులో నీళ్లు అనుకోని యాసిడ్ తాగి మృతి చెందిన ఘటన తెలంగాణ లో మంచిర్యాల జిల్లా మల్కల్ల గ్రామంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం మల్కల్ల గ్రామంలో ఎర్రవేని మహేష్ సింగరేణిలో పనిచేస్తు జీవనం కొనసాగుతున్నాడు. మద్యం అలవాటు ఉన్న మహేష్ గత నెల ఏప్రిల్ 18న మధ్యంలో మంచి నీరు అనుకుని యాసిడ్ కలిపి తాగాడు. అప్పటికే ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నాడు మహేష్.. దీంతో పాటు యాసిడ్ కలిపి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 18 నుంచి నిన్నటి వరుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఆదివారం మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs