తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీర్ ఈరోజు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటల సమయానికి కామారెడ్డి జిల్లా కోనాపూర్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు నూతన పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి కేటీర్ శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని దమ్మన్నపేటకు చేరుకుంటారు అక్కడ పల్లెప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అదే గ్రామంలో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణం మరియు రెడ్డి సంఘం భవనం మరియు రైతు వేదికను కేటీర్ ప్రారంభిస్తారు. అక్కడ డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత పోచమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1 గంటకు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లను, బొప్పాపూర్‌లో పీఏసీఎస్ గోదాం మరియు మధ్యాహ్నం 2గంటలకు ఎల్లారెడ్డిపేటలో జడ్పీటీసీ కార్యాలయాన్ని మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. 3.30 గంటలకు రాజీవ్ నగర్ లోని గ్రామ శివారులో రూ.5కోట్లతో కొత్తగా నిర్మించిన చిన్న స్టేడియం ప్రారంభిస్తారు అదే రోజు సాయంత్రం 4గంటలకు కొత్త చెరువును ప్రారంభిస్తారు. మంత్రి రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.