ఇటీవల టైర్ పేలి అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి . తాజా గా తెలంగాణ లోని మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా లోని హావేలి ఘనాపూర్ మండలం వద్ద ఓ ప్రైవేట్ బస్సు టైరు పేలి బోల్తా కొట్టింది. దీంతో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి అజ్మీర్‌కు వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఇద్దరు తల్లి మరియు కూతురు అజితా బేగం, దహిగా బేగంగా గుర్తించారు. బస్సు లో ఎక్కువ శాతం ముస్లిం లు ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన వారిన దగ్గర్లో ఉన్న మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.పోలీస్ లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs