నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగగా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ తల ధోనీ చివరి ఆడిన ఇన్నింగ్స్ పైన పలువు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాత్రి ధోని ఆడిన ఇన్నింగ్స్ పైన మ్యాచ్ ఐపోగానే కొద్దీ నిమిషాల్లోనే ట్విట్టర్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసలు కురిపించారు.
కేటీర్ ట్వీట్ చేస్తూ ” వాస్తవానికి వయసు ఒక అంకె మాత్రమే అని… ధోనీ నిజంగా ఒక ఛాంపియన్.. అసాధారణ ఫినిషర్.. ఒక లెజెండ్’ అంటూ ధోని పైన మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం అవ్వగా ధోని చివరి ఓవర్ లో దుమ్ములేపాడు ఓ సిక్స్, రెండు ఫోర్లు మరి రెండు పరుగులు తీసి చెన్నై ని గెలిపించాడు.