ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన గాను విదేశాలకు వెళ్లనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా విదేశీ పర్యటన కు వెళ్తున్నారు. .మే 2వ తేదీ నుంచి మే 4 వరుకు విదేశీ పర్యటన ఉండనుంది. తొలుత ఆయన జర్మనీ దేశానికి వెళ్లనున్నారు.అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్తారు. తిరిగి మే 4వ తేదీన ప్యారిస్ కు చేరుకుంటున్నారు. మోడీ పర్యటనల గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బేర్లిన్ లో జర్మనీ ఫెడరల్ చాన్సలర్ ఓలాప్ షోల్స్ తో మోడీ ద్వైపాక్షిక పైన చర్చలు ఉండనున్నాయి. అక్కడే ఇండియా జర్మనీ ఇంటర్- గవర్నమెంటల్ కన్సల్టేషన్ 6 వ ఎడిషన్లో ప్రధాని మోదీ జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్స్ ఇద్దరు కలిసి పాల్గొంటారు. ఈ సమావేశంలోనే ఈ సమావేశంలోఈ సమావేశంలో ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చిస్తారు. డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్ హగన్ వెళ్తారు.అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న రెండవ ఇండియా నార్దిక్ సమ్మిట్ లో మోదీ పాల్గొనబోతున్నారు.ఈ సదస్సులో ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధాన మంత్రుల తో మోడీ భేటీ అవుతారు.కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు పైన నాలుగో వేవ్ పైన ఈ భేటీలో చర్చకు రానుంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs