తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడికి తెల్లవారి లెగిస్తే, ఏం పని పాట లేదని విమర్శలు చేయడం తప్పితే, అతని వల్ల రాష్ట్రానికి ఆ ప్రాంతానికి ఉపయోగం లేదన్నారు. అయిన ఓ పచ్చి తాగుబోతు అని… ఆయన భూమికి భారంగా మారాడని అన్నారు విజయసాయి రెడ్డి. అయ్యన్న పాత్రుడు కుమారులు నిరుద్యోగులుగా ఉన్నారని … వస్తే ఉపాధి కలిపిస్తాం అన్నారు. జాతీయ పార్టీ తో పొత్తు పైన మాట్లాడుతూ రాష్ట్రానికి ఏ పార్టీ తో ప్రయోజనం ఉంటె ఆ పార్టీ తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తాము అన్నారు. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. వైసీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నం అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ రంగంలో ఈ ఉపాధికల్పించినట్లు చెప్పుకొచ్చారు. సమాజంలో నైతిక విలువలుపడిపోతున్నాయని .. విద్యార్థులు పాటించాల్సిన ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs