మేడ్చల్ లో వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

by Publicnowtelugu

మేడ్చల్ శ్రీ గడి మైసమ్మ దేవస్థానం లో  దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.  నేటి నుంచి అక్టోబరు 05 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మెుత్తం 9 రోజులుపాటు పది అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 

ఈ క్రమంలో తొలి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పర్వతరాజు కుమార్తె అయిన శైలపుత్రి ని తొలిరోజు భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం శైలపుత్రి అయిన సతీదేవి శివుని భార్య, సతీదేవి తండ్రి ఆయన దక్ష ప్రజాపతి యాగం చేస్తూ పరమశివుని ఆహ్వానించకుండా అవమానిస్తే, సతీదేవి తన భర్తను అవమానించినందుకు యాగ మంటల్లోనే దూకి కాలిపోతుంది. ఇక మరుసటి జన్మలో సతీదేవి శైలపుత్రి రూపంలో కనిపించి శివుని మళ్ళీ వివాహం చేసుకుంటుంది.

శైలపుత్రిని పూజించటం వల్ల కలిగే ఫలితమిదే

పురాణాలలో, ధర్మ శాస్త్రాలలో శైలపుత్రిని పూజించడంవల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని సూచించబడింది. శైలపుత్రి పూజ వలన ప్రతికూల శక్తులు నశిస్తాయి అని చెప్పబడింది. తమలపాకుపై లవంగాన్ని ఉంచి, దానిపై పంచదార మిఠాయి శైలపుత్రి కి నైవేద్యంగా పెట్టడం ద్వారా మీ జీవితంలోని ప్రతి కోరిక నెరవేరుతుందని కూడా సూచించబడింది. అమ్మవారు అత్యంత మహిమాన్విత కావటంతో ఆమె అన్ని కోరికలను నేరవేరుస్తారని సూచించబడింది.

హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో శరన్నవరాత్రులు (Navaratri 2022) ఒకటి. ఈ ఉత్సవాలను అశ్విన మాసంలో జరుపుకుంటారు. ఈ పండుగను సంవత్సరానికొకసారి జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈసారి దసరా లేదా విజయ దశమి అక్టోబరు 5న వస్తుంది

Leave a Comment