నిన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీ నష్టలతో సుమారు 13 లక్షల కోట్లు నష్టం అని అంచనా వేశారు ఇదే ట్రెండ్ మరో వారం రోజుల పాటు కొనసాగుతుంది అనే లోపే అందరిని షాక్ చేస్తూ భారీ లాభాలతో ఈరోజు స్టాక్ మర్కెట్స్ ప్రారంభం అయింది
ఈరోజు సెన్సెక్స్1133 పాయింట్లు పెరిగి 55662 వద్ద ట్రేడ్ నడుస్తుంది . నిఫ్టీ 350 పెరిగి 16597 వద్ద కొనసాగగా టాటా మోటర్స్, టాటా స్టీల్, యూపీఎల్, అదానీ పోర్ట్ స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. . గురువారం స్టాక్ మర్కెట్స్ పడిపోవడానికి కారణం పెట్టుబడులే ఒక అవకాశంగా భావించారు. దీంతో ఈరోజు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా జంప్ చేసింది
మరో వైపు ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా దాడి చేయడాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. పలు దేశాలు ఇప్పటికే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అమెరికా సైతం కన్నెర్ర చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా యుద్ధం ఆపాలని రష్యా ప్రధాని ని పుతిన్ ని కాల్ లో కోరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‍తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడారు చర్చించిన పుతిన్, మేక్రాన్ – తక్షణమే ఉక్రెయిన్‍పై దాడులు ఆపాలని పుతిన్‍ను మేక్రాన్ కోరారు.