జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా ఆత్మహత్య చేసుకున్న వారికి తోడుగా జనసేన వుంటుందని ప్రకటించిన పవర్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ రాకతో జనసేన నాయకులూ కార్యకర్తలు బారి స్వాగతం పలికారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 40 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించరు. ఎవరు పట్టించుకోకపోయిన మేము మీకు అండగా ఉంటాం అని తెలియచేయటానికి, మా వంతు సాయం చెయ్యటానికి వచ్చామని వారికి భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ చనిపోయిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్ ను అందించారు. పవన్ పర్యటన జై జగన్ స్లొగన్స్ వినిపించడంతో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నన్ను దత్త పుత్రుడు అంటే ననేను కూడా ఇక మీదట సిబిఐ దత్త పుత్రుడు అంటాను అని చెప్పారు.భరత్ దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానం ఉందన్నారు .. కైలు రైతుల కష్టాలు పరిష్కరించకుండా నన్ను దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారు, నన్ను దత్తపుత్రుడు అని విమర్శిస్తే.. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అంటాను అని మండిపడ్డారు పవన్ .