ఈ కామ సైకో కు మహిళలే టార్గెట్. పలు కాలనీలలో ఒంటరిగా వెళుతున్న మహిళలను చేతులతో తాకి కామం తీర్చుకోవడం , రాత్రి పూట చీకటి పొదల్లో దాకొని ఉండి అసభ్యంగా ప్రవర్తించడం ఈ సైకో లక్షణం. ఎలా ఒకటి కాదు రెండు నెలల కాదు దాదాపు ఒక ఏడాది పాటు ఆ సైకో వీరంగం నల్గొండలో జిల్లాలోని మహిళలకు నరకం చూపించాడు.
నల్గొండ జిల్లాలో మహిళలు సైకోపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ సైకో నల్గొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లలో టీచర్‌గా పని చేసాడు అని పోలీస్ లు తెలిపారు. తన నుంచి భార్య విడాకులు తీసుకోవడంతో ఇలాంటి ఈ కామాంధుడు చేష్టలు మరింత ఎక్కువ అయ్యాయని పోలీసులు తెలియచేసారు.