ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని గా ఉండాలి అంటూ సంచలన తీర్పు తర్వాత పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మీడియా ముందు ఉండే రఘురామకృష్ణం రాజు స్పందించారు. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమరావతి గురించి హై కోర్టు తీర్పు ఇవ్వగానే కృష్ణంరాజు స్వీట్స్ పంచారు. CRTA చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తీ చేయాలని కోర్టు ఆదేశించిందని అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మేలుకొని అమరావతి ని రాజధాని గా నిర్ణయం తీసుకోవాలని అని సూచించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs