రైల్వే శాఖ పుట్టిన బిడ్డల కోసం తల్లుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ట్రైన్ లో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీటు ఇబ్బంది లేకుండా మంచి నిర్ణయం తీసుకుంది. దీని కోసం సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో రైల్లో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా రైల్వే శాఖ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందుకే ఇందులో బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు ఈ చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను కొత్తగా ముందుకు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్‌లో తొలిసారిగా తీసుకొచ్చారు. లక్నో లో మంచి స్పందన వస్తే భరత్ లో మరికొన్ని చోట్ల దీని ముందుకు తీసుకొస్తాం అని తెలియచేసారు. ఇండియా లో రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణం చేస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ్డలు ఒకే బెర్త్‌పై ఉండాల్సి వచ్చేది. అటువంటి సమయంలో తగినంత చోటు లేకపోవటం ఇబ్బంది పడేవారు. ఇటువంటి సౌకర్యం కచ్చితంగా చంటిబిడ్డలున్న తల్లులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం చెయ్యవచ్చు.