16716902607537667714

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రామ్‌చరణ్

చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. మరో రెండు రోజులో ఏప్రిల్ 29 న ఆచార్య సినిమా భారీ ఎత్తున్న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా క్రమంలో రామ్‌ చరణ్‌, కొరటాల శివ అమ్మవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ వస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు భారీ ఎత్తున్న చేరుకున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు అభిమానులు చరణ్ వస్తున్న కారు పైన పూల వర్షం దారి పొడవునా కురిపించారు. అనంతరం రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకొచ్చారు. ఆలయం లోపల జై చరణ్ అంటూ నినాదాలు చేసారు. అభిమానులు భారీగా ఆలయం లోపాలకి తరలి రావడంతో అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. చరణ్ ని చూసేందుకు ఆలయం లోపల కూడా ఎగబడ్డారు. దీంతో క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. దుర్గ గుడి దర్శనం తర్వాత చరణ్‌, కొరటాల శివ విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow