రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి మరియు నరకం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి అని ముస్లింలు భావిస్తారు. రంజాన్ మాసం లో శాంతియుత, నిశ్శబ్ద సమయం ఉంటుంది. సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాత వారు ఉపవాసం విరమించుకుంటారు. ముస్లింలు ఒక పూర్తి నెల దీన్ని చేస్తారు మరియు 30 వ రోజు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.
ఈ సంవత్సరం, ముస్లింలు భారతదేశం లో ఏప్రిల్ 25 నుండి మే 25 సాయంత్రం వరకు పవిత్ర రంజాన్ మాసం జరుపు కుంటున్నారు. ఒక నెల ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక ఉద్దేశ్యం ఆకలి మరియు దాహం యొక్క బాధను అర్థం చేసు కోవడం. నెల రోజులు శ్రమించిన వారికి పరిపూర్ణ ప్రతి ఫలం రంజాన్ రోజే లభిస్తుందని నమ్ముతారు.
దీర్ఘకాలిక అనారోగ్యం, గర్భవతులు మరియు డయాబెటిక్ ఉన్నవారు తప్ప అందరికీ రంజాన్ ఉపవాసం తప్పనిసరి. ప్రతిరోజూ ఉదయాన్నే భోజనం( సుహూర్ ) చేస్తారు మరియు సూర్యాస్తమయం తరువాత భోజనం (ఇఫ్తార్) మధ్య ఉపవాసం నడుస్తుంది. ప్రతి రోజూ తెల్లవారు జాము నుండి రాత్రి వరకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు.వాటికి వివిధ పేర్లు కూడా ఉన్నాయి. ఫజ్ర్ – తెల్లవారు జామున , ధుహ్ర్ – ఉదయం, అస్ర్ – మధ్యాహ్నం, మాగ్రిబ్ – సాయంత్రం మరియు ఇషా – రాత్రి . భారతదేశం లో అన్ని మసీదులు, దేవాలయాలు, చర్చిలు మరియు ఇతర మత ప్రదేశాలు మూసి వేయబడ్డాయి. కనుక రంజాన్ మాసంలో, ముస్లింలు రోజు వారి పనులువిడిచిపెట్టి, వారి కుటుంబం మరియు స్నేహితుల తో ఉపవాసం ఉంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం, వారి ఇళ్ల లో రంజాన్ వేడుకలను జరుపు కుంటున్నారు. శాశ్వత ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు ఉపవాసం బదులుగా పేదలకు సహాయం చేస్తారు. ఉపవాసం గురించి మర్చిపోయి ఎవరైనా తిన్నా లేదా త్రాగినప్పుడు ఉపవాసం చెల్లుతుంది.
ఉపవాసం తో పాటు, రంజాన్ మాసం అల్లాహ్ పై మీ విశ్వాసాన్ని తిరిగిపొందే సమయం. పవిత్ర మాసం లో మీరు చేయగలిగే కొన్ని పనులు ప్రతి రోజూ ఖురాన్ చదవడం, సమయానికి ప్రార్థనలు పాటించడం, క్షమాపణ కోరడం, ఆరోగ్య కరమైన సంబంధాలను పెంచుకోవడం. వైద్య కారణాల వల్ల ఇంజెక్షన్లు అవసరమైతే కొనసాగించవచ్చు , ఉపవాసం విచ్ఛిన్నం కాదు.
ముస్లిమ్లు మాత్రమే కాకుండా ఇతరులు రంజాన్ సందర్భంగా తమ ముస్లిం స్నేహితుల తో ఉపవాసం మరియు ప్రార్థన చేయవచ్చు. పర్వ దినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని, కొత్త బట్టలు ధరించి పన్నీరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ మసీదుకు చేరు కుంటారు. అక్కడ ప్రార్థనలను చేసుకుంటారు. ఈద్ ముబారక్ తెలియజేసు కుంటారు. తర్వాత ముస్లిం సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. విందులు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బందువులు తో గడుపుతారు. ఇది సమైక్యతను తెలియ జేస్తుంది. ఇలా ముస్లింలు రంజాన్ మాసం అంతా కూడా పాటించి అనేక విధాలుగా ఈ పండుగని జరుపుకోవడం తరతరాల నుండి వస్తున్నా సాంప్రదాయం.